సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి జిల్లా: రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని బద్ది దర్శినిని దారుణంగా హత్య చేసిన కేసు లో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం శివారులో సురేష్ మృతదేహం గుర్తించారు. ఈనెల ఆరవ తేదీన శనివారం 9వ తరగతి విద్యార్థిని దర్శినిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది సురేష్, పాఠశాల నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి గదిలోకి వెళ్లిన దర్శినిని కత్తితో నరికి చంపాడు.
అప్పటినుంచి నిందితుడి కోసం 14 పోలీసు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.. ఇతని ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని పోలీసు వారు ప్రకటించారు..
ఈ నేపథ్యంలో బుధవారంసురేష్ మృతదేహం గ్రామ శివారులో కనిపించింది.. ఇతని మృతదేహం బాగా కుళ్ళిపోవడంతో ఇతను ఆత్మహత్య ఎలా చేసుకున్నది తెలియ రాలేదు.. అయితే ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు.. మృదేహాన్ని స్వాధీనం చేసుకొని శివ పరీక్ష కోసం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.. విద్యార్థిని దర్శిని హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.. దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ కేసులో నిందితుడు తక్షణం పట్టుకోవాలని హోం శాఖ మంత్రి అనిత పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే