సిరా న్యూస్, జైనథ్:
ఆనంద్ పూర్ లో పెద్ద ఎత్తున నాటు కోళ్ల పెంపకం
+ తక్కువ ధరకే నాణ్యమైన నాటు కోళ్లు లభ్యం
+ 14 ఎకరాల విస్తీర్ణంలో 2 వేల కోళ్ల పెంపకం
+ ఆదర్శంగా నిలుస్తున్న రైతు చింతల్పెళ్లి దశరథ్ రాంరెడ్డి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఆనంద్ పూర్ గ్రామంలో పెద్ద ఎత్తున నాటు కోళ్ల పెంపకం చేపడుతూ రైతు చింతల్పెళ్లి దశరథ్ రాంరెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాంప్రదాయ పంటలతో పాటు హార్టికల్చర్ లో దాదాపు 20 ఏళ్ల వ్యవసాయ అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం కోళ్ల పెంపకం పై దృష్టి సారించారు. గ్రామానికి కూత వేటు దూరంలో ఉన్న తన 14 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రస్తుతం దానిమ్మ పంట సాగు చేస్తున్నారు. దానిమ్మ మొక్కలు ఏపుగా పెరగడంతో ఇతర అంతర పంటలు వేసే అవకాశం లేకపోవడంతో, ప్రత్యామ్నాయంగా కోళ్ల పెంపకం చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలోనే కోళ్లు రాత్రివేళ విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన షెడ్డును నిర్మించారు. పగటిపూట కోళ్లు దానిమ్మ క్షేత్రంలో తిరుగుతూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. చేను చుట్టూ సోలార్ కంచె తో పాటు ఫిషింగ్ నెట్ ను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో దొరికే నాణ్యమైన నాటుకోడి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ పెంచుతూ, మాంసాహార ప్రియులకు ఆరోగ్యకరమైన నాటు కోళ్లను అందిస్తున్నారు. ప్రస్తుతం 2 వేల నాటు కోళ్లు అందుబాటులో ఉండగా, చాలామంది వ్యాపారస్తులు, రైతులు నేరుగా చెన్లకు వచ్చి కోళ్లను తీసుకెళ్తున్నారు. కిలో కు రూ. 350 చొప్పున తక్కువ ధరకే నాణ్యమైన కోళ్లను అందించడంతో, ప్రస్తుతం ఈ కోళ్లకు భారీ డిమాండ్ నెలకొంది.

అందుబాటులో 2 వేల కోళ్లు…
మా ఫామ్ లో దాదాపు 2 వేల నాటు కోళ్లు అందుబాటులో ఉన్నాయి. కోళ్ల ఫారం లో పెరిగే కోళ్లు అంతా రుచిగా ఉండకపోవడమే కాకుండా నాణ్యత లేకుండా ఉంటాయి. మా వద్ద లభించే కోళ్లు ఫారంలో కాకుండా చేన్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఆహార సేకరణ చేయడంతో ఆరోగ్యంతో పుష్టిగా ఉంటాయి. నాటు కోళ్లు అవసరమైన వాళ్లు నా ఫోన్ నెంబర్ 9440043628 కి ఫోన్ చేయడంతో తో పాటు నేరుగా చేన్లకే వచ్చి ఇష్టమైన కోళ్లను ఎంపిక చేసుకొని తీసుకునే అవకాశం ఉంది. కిలోకు రూ. 350 చెల్లించి రిటైల్, హోల్సేల్ లో కూడా కొనుగోలు చేయవచ్చు.
-చింతల్పెళ్లి దశరథ్ రాంరెడ్డి