సిరాన్యూస్,దస్తురాబాద్
దస్తురాబాద్‌లో మొక్కలు నాటిన బీఆర్ఎస్ నాయకులు
* ఘనంగా కేటీఆర్ కు జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మ దిన వేడుకలు బుధవారం దస్తూరాబాద్ మండల అధ్యక్షులు ముడికె ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, తండ సర్పంచ్ సురేష్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.