Dattha Jayanthi in Tamsi: తాంసి-కే లో ఘనంగా దత్త జయంతి వేడుకలు…

సిరా న్యూస్, భీంపూర్:

తాంసి-కే లో ఘనంగా దత్త జయంతి వేడుకలు…

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి-కే గ్రామంలో శ్రీ గురు దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సదర్భంగా స్వామి వారి చిత్రపటాన్ని బంతిపూలతో అలంకరించిన పల్లకిలో ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా, డప్పు వాయిదా నడుమ భక్తుల దర్శనార్థం శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున భజనలు, సంకీర్తనలు గావించారు. ఈ సందర్భంగా దహి హాండి పగలగొట్టి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాక మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా గ్రామంలో దత్త జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ… ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని, యువత భక్తి మార్గంలో పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *