సిరా న్యూస్,కాకినాడ;
దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకా వారి పాకల వద్ద దారుణం జరిగింది. జీడిగింజలు లోడుతో వెళ్తున్న డిసిమ్ లారీ బోల్తా పడడంతో ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి జీడిగింజల లోడుతో నిడదవోలు మండలం తాడిమల్ల వెళుతూ వుండగా చిన్నయగూడెం శివారు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. వ్యాన్ లో పదకొండు మంది వుండగా జీడీ గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. .నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రమాద సమయంలో లారీలో పదకొండు మంది ప్రయాణిస్తున్నారు. వెనుక ఎనిమిది మంది క్యాబిన్లో ఐదుగురు వున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన జట్టు కార్మికులు మృతులు వీరే
సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ ఈ ఘటనలో మృతి చెందారు…