సిరా న్యూస్, జైనథ్
టేకం శివకుమార్ మృతదేహం లభ్యం…
+ శవానికి పంచనామ నిర్వహించిన పోలీసులు
+ పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలింపు
+ శవాన్ని చూసి బోరున విలపించిన కుటుంబీకులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి టేకం శివకుమార్ మృతదేవం లభించింది. గురువారం ఉదయం సాత్నాల ప్రాజెక్టులో దూకిన టేకం శివకుమార్, ప్రాజెక్ట్ ఒడ్డున తన రిస్ట్ వాచ్, సూసైడ్ నోట్ వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శివకుమార్ కోసం గజ ఈతగాళ్ల తో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారు నాలుగు గంటల తర్వాత ఎట్టకేలకు శివకుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా శివకుమార్ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు గుండెలు పగిలేలా బోరున విలపించారు. పోలీసులు శవానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కి తరలించారు.