స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

సిరా న్యూస్,హైదరాబాద్;
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి హబ్సిగూడలో జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కిందపడి జెవాలానా (2) అనే చిన్నారి దుర్మరణం పాలయింది. ఓయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన మిథున్ హబ్సిగుడాలోని స్ట్రీట్ నెంబర్ 8 నివాసం ఉంటున్నారు. పెద్దబ్బాయి జాన్సన్ గ్రామర్ స్కూల్లో 1 వ తరగతి చదువుతున్నాడు. కాగా జెవలానా తల్లిదండ్రులు తమ పెద్ద అబ్బాయిని బస్సు ఎక్కించే క్రమంలో ఉండగా, చిన్నమ్మాయి స్కిడ్ అయ్యి బస్సు కింద పడిపోయింది. అది గమనించని బస్సు డ్రైవర్ వెంటనే బస్సును వెనక్కి జరపడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, సంఘటనకు కారణమైన బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *