గర్భస్థ శిశువు మృతి..బంధువుల అందోళన

సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ గర్భంలోని శిశువు మరణించిందని మహిళ కుటుంబికులు అందోళనకు దిగారు. బోయినపల్లి మండలం జగ్గారావుపెల్లి కి చెందిన తిప్పరవేని చందు- అమూల్యలకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా, తొలి కాన్పు సమయం కావడంతో వేములవాడ ఏరియా హాస్పిటల్ మూడు రోజుల క్రితం అడ్మిట్ చేసారు. ఆపరేషన్ చేయాలని అమూల్య బంధువులు ఎంత వేడుకున్నా డాక్టర్లు మాత్రం పట్టించుకోకుండా ఆపరేషన్ చేయాలంటే అనస్తీషియా అందుబాటులో లేడని, ఆపరేషన్ చేసే డాక్టర్ లేడని పొంతనలేని సమాధానాలు చెప్పారు. అప్పటికే తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న అమూల్య గర్భంలోని శిశువు మరణించాడు. వెంటనే తేరుకున్న డాక్టర్లు ఆదరాబాదరగా ఆమెకు ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును బయటకు తీసారు. దాంతో ఆగ్రహం తో కుటుంబ సభ్యులు ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పసి పాప మృతి చెందినదని, బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *