సిరా న్యూస్,చింతూరు;
అల్లూరి జిల్లా కూనవరం మండలం, నర్సింగపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న కారం సంధ్య అనారోగ్యంతో మృతి చెందింది. ఎటపాక మండలం, ఎర్రబోరు గ్రామానికి చెందిన కారం సంధ్య కూనవరం మండలం నర్సింగపేట గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో 7 వ తరగతి చదువుతోంది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను సిబ్బంది కూనవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తహీనతకు గురై బాలిక అపస్మారక స్థితికి చేరుకుంది. ఐనప్పటీకి తల్లికి, కుటుంబీకులకు విద్యార్థిని ఆరోగ్యం పై సమాచారం ఇవ్వకపోవడం… సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం వహించడం వల్లనే విద్యార్థిని మృతిచెందిందని మృతురాలి తల్లి ఆవేధన వ్యక్తం చేస్తోంది. విద్యార్థి మృతదేహంతో బంధువులు పాఠశాల ఎదుట ధర్నా చేపట్టి, అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించిన హెడ్ మాస్టర్, వాఁర్డెన్లపై చర్యలు చేపట్టి, తండ్రి లేని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.