సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన ఉత్సవ కార్యక్రమం,
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ప్రస్తుత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణ, యశస్వినీ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఫ్రొ, కోదండరాం, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ,ఇతర ముఖ్య నేతలు మేధావులు, అమరవీరుల కుటుంబాలు,
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు మాజీ ఎంపీలకు, అమరవీరుల కుటుంబాలకు, మేదావులకు ఘన సన్మానం..
మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ,
తెలంగాణ లో బిల్లు పెట్టినప్పుడు 12 మంది పార్లమెంట్ సభ్యులం అంతా కలసి కొట్లడినం.
తెలంగాణ రావడానికి ఏ ఒక్కరి కృషి తో రాలేదు.
10 సంవత్సరాల ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి చెప్పినట్టు అందరి ఆత్మ గౌరవం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది.
తెలంగాణ లో నీళ్ళు, నిధులు, నియామకాలు ఆత్మగౌరవం కోసం కొట్లడిన తరువాత ఏర్పడిన ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది.
అమరుల కుటుంబాలను ఆదుకోవడం, వారికి సముచిత గౌరవం అభివృద్ధిలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం.
11 వ ఆవిర్భావ దినోత్సవం లోపు గతంలో ఉద్యోగాలు ఇవ్వని అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25 వేల పెన్షన్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారికి 250 గజాల స్థలం ఇస్తా.
ప్రభుత్వం పక్షాన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి పక్షాన జిల్లా మంత్రుల పక్షాన ఈ సంవత్సరం ఘనంగా కాకతీయ ఉత్సవాలు జరుపుకుందాం.
క్యాబినెట్ లో చర్చించిన తరువాత భవిష్యత్ లో మనం ఎవరు ప్రసంగించిన జై తెలంగాణ అని విధంగా చట్టరీత్య చేస్తాం.
కాకతీయ యూనివర్సిటీ గడ్డ అభివృద్ధికి వేదికగా కావాలి.
మేము ప్రజా పాలన అందిస్తున్నాం.
గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కలవలనుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి.
ప్రజా పాలన అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ది.
ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే కూలిపోతుందని పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు.
5 ఫీట్లు ఉంటేనో,మోకలెత్తూ ఉంటేనే కాదు దమ్ముతో కూడిన పని,
ఆత్మగౌరవం తో కూడుకున్నది,
తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ కూడా అవమానకరం కల్గించాం.
శ్రీకాంత్ చారి మరణాన్ని అవహేళన చేసే విధంగా అమారులను అవమానించే విధంగా పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడారు.
ఆర్టికల్ 3 ద్వారా అధికార ప్రతిపక్షం కలిసి ఆనాడు తెలంగాణ బిల్లు పాస్ చేశారు.
ఇలా అవమానకరంగా మాట్లాడడం సరికాదు వారి నాయకత్వానికి చెప్పండి.
తెలంగాణ ఉద్యమం ఫుడ్ బాల్ గ్రౌండ్ లాంటిది. అందరూ కొట్లడితేనే తెలంగాణ వచ్చింది.
ప్రతి ఒక్కరూ డిల్లి పార్లమెంట్ లో మా గొంతు వినిపించే అవకాశం కల్పించారు.
డిల్లి వేదికగా పార్లమెంట్ సాక్షిగా నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ కోసం కొట్లాడినం పోరాడినం.
======================