డిసెంబర్ రెండోవ వారంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు – డిఇఓ గోవిందరాజులు

సిరా న్యూస్,నాగర్ కర్నూల్;

విద్యార్థులలో సృజనాత్మక శక్తి వెలికి తీసి వారిలోని ఆలోచన శక్తిని, సైన్స్ పరిజ్ఞాన పరిశీలనా నైపుణ్యాన్ని మరియు ప్రయోగ నైపుణ్యాలను పెంపొందిస్తూ భావి శాస్త్రవేత్తలను తయారు చేయడానికి అవకాశం కలిగించే జిల్లాస్థాయి విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన డిసెంబర్ రెండవ వారంలో నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
క్రింద తెలియపరిచిన ప్రదర్శనలో నిర్వహించు అంశాల వారీగా విద్యార్థులు తమ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రధాన అంశము:; సమాజం కోసం శాస్త్ర సాంకేతిక విద్య
ఉప అంశాలు::

1. ఆరోగ్యం
2. పర్యావరణహిత జీవన విధానం
3. వ్యవసాయం
4. కమ్యూనికేషన్ మరియు రవాణా
5. గణన నైపుణ్యం
జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల నుండి పైన తెలిపిన అంశాల నుండి ఉన్నత పాఠశాల నుండిఏవేని రెండు ప్రదర్శనలు ప్రాథమికోన్నత పాఠశాల నుండి ఒక ప్రదర్శన తప్పకతీసుకురావాలని డి ఈ ఓ అన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన (science fair)లోనే గత విద్యా సంవత్సరం ఎంపికైన 66 ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శనలు కూడా ప్రదర్శించవలనని డిఈఓ సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనతో పాటు విద్యార్థులకు సెమినార్ ను కూడా నిర్వహిస్తారని అన్నారు.
సెమినార్ అంశము:: ఆరోగ్య మరియు సుస్థిరమైన భూగ్రహం కోసం- చిరుధాన్యాలు. విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో మంచి ప్రదర్శనలు ప్రదర్శించేటట్టు సైన్స్ మరియు గణిత ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని deo సూచించారు.
మరిన్ని వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి (9989921105)ని సంప్రదించాలి ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *