Demand for Resign: డిసిసిబి పదవి జోగు రామన్న బిక్ష…

సిరా న్యూస్, జైనథ్:

డిసిసిబి పదవి జోగు రామన్న బిక్ష…

– బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ యాదవ్

– అడ్డి బోజారెడ్డి బిఆర్ఎస్ ను వీడడంపై కౌంటర్

– డిసిసిబి చైర్మన్ పదవికి అడ్డి భోజా రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్

ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ పదవి జోగు రామన్న పెట్టిన బిక్ష అని బిఆర్ఎస్ పార్టీ జైనథ్ మండల ప్రధాన కార్యదర్శి పులివేణి గణేష్ యాదవ్ అన్నారు. సోమవారం ఈ మేరకు జైనథ్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జోగు రామన్న అధికారంలో ఉన్నప్పుడు అతనికి రామ బంటు లాగా మెలిగిన అడ్డి బోజారెడ్డి, జోగు రామన్న పదవి కోల్పోగానే పార్టీ కి రాజీనామా చేయడం దురదృష్టకరమని అన్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసే ముందు డిసిసిబి చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అడ్డి బోజారెడ్డి తన స్వార్ధ రాజకీయాల కోసం, పదవి కాంక్ష తో మాత్రమే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఎవరు పార్టీని వీడినా, తామంతా జోగు రామన్న వెంబడి ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా ప్రజల పక్షాన నిరంతరాయంగా పోరాటం చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జోగు రామన్నల ఆధ్వర్యంలో పార్టీ కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, రానున్న రోజుల్లో ప్రతిపక్ష హోదాలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ దుమాల దేవన్న, పుండ్రు వెంకటరెడ్డి, గడ్డం జగదీశ్ రెడ్డి, తదితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *