Demand for Rtc Bus: బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

సిరా న్యూస్, భీంపూర్:

బస్సు సౌకర్యం కల్పించాలని వినతి:

తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిచాలని తాంసి గ్రామ సర్పంచ్ షేక్ కరీం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గ్రామస్తులతో కలిసి ఆదిలాబాద్ డిపో మేనేజర్ కల్పనకు వినతిపత్రం అందించారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో, ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉద్యోగులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. వెంటనే తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. యావత్ రాష్ట్రమంతా మహాలక్ష్మి పథకం అమలు అవుతుంటే, తమ గ్రామస్తులు మాత్రం ఈ పథకానికి నోచుకోవడం లేదని వాపోయారు. సానుకూలంగా స్పందించిన డిఎం సాధ్యాసాధ్యాలను  పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *