Demand for RTC Bus: కల్మలచెరువుకి బస్సు సౌకర్యంపునరుద్ధరించాలి…

సిరా న్యూస్, సూర్యాపేట:

కల్మలచెరువుకి బస్సు సౌకర్యంపునరుద్ధరించాలి…

సూర్యాపేట జిల్లా కల్మలచెరువు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని సర్పంచ్ మూలగుండ్ల విజయ సీతారాంరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు గ్రామస్తులతో కలిసి మిర్యాలగూడ బస్సు డిపో అసిస్టెంట్ మేనేజర్ సంధ్యారాణికి లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేదని, కానీ అధికారులు లాభాలు పేరిట బసౌకర్యాన్ని తొలగించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి తమ గ్రామం నోచుకోవడం లేదని అన్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వెంటనే తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *