సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
సుభాష్ నగర్ డివిజన్ సురారం ఓంజెండా వద్ద డబుల్ రిజిస్ట్రేషన్ ప్లాట్ లో అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని మొదటి యాజమాని పిర్యాదు చేసారు. ఈ నేనధ్యంలో సదరు ఇళ్లును కూల్చివేసి సంబందిత ఓనర్స్ కు ప్లాట్ ను అప్పగించాలని కోర్టు జిహెచ్ఎంసి కి సూచించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు జిహెచ్ఎంసి సిబ్బంది అక్రమనిర్మాణాన్ని జెసిబిల సహయంతో కూల్చివేసారు. పోలీసుల ప్రొటెక్షన్ సహయంతో అధికారులు అక్రమనిర్మాణాన్ని నేల కూల్చుతున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు, స్థానికుల మద్య వాగ్వదం జరిగింది. అక్కడ ఉద్రిక్తత నెలకొంది.