సిరా న్యూస్,మచిలీపట్నం;
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడాలనపు ధ్వంసం చేసారు. మచిలీపట్నం నగరంలో కుమ్మరి గూడెం మురుగు పోరంబోకు ఆక్రమించుకుని గత ప్రభుత్వంలో వందలాదిమంది నిర్మాణం చేపట్టారు. మురుగు కాలవ పక్కనే ఉన్న ఈ నిర్మాణాలు ప్రమాదమని గ్రహించిన అధికారులు తొలగించాలని హెచ్చరికలు జారీ చేశారు. లక్షలాది రూపాయలతో నిర్మాణం చేపట్టిన స్థానికులు స్పందించకపోవడంతో ఈరోజు నగరపాలక సంస్థ, రెవిన్యూ, పోలీస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కట్టడాలలో ధ్వంసం చేశారు. దీంతో ధ్వంసం చేస్తున్న ప్రాంతంలో నిర్మాణం చేపట్టిన స్థానికులకు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇక్కడ గృహాలు నిర్మించుకోమని అనుమతించాయని దీంతో కరెంటు, రోడ్లు నిర్మించుకున్నామంటూ ఇప్పుడు మాకు సమయం ఇవ్వకుండా కూల్చివేతలు ఏమిటని బాధితులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో గాని అనుమతి లేని ప్రాంతాల్లో నిర్మాణాలు ఎక్కడ జరిగిన ఇలాంటి చర్యలు తప్పవని హెచ్చరించారు