సిరా న్యూస్,రంగారెడ్డి జిల్లా;
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నీ కుర్మాల్గూడ జెఎన్నాయూఎం కాలనీలో హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రి ధ్వంసం చేసారు దుండగులు. ప్రభుత్వ భూమిని కబ్జా యత్నం లో భాగంగా ఇతర మతస్తులు రాత్రికి రాత్రి జెండాలు కట్టారు. ప్రభుత్వ భూమి లో నిర్మించిన దేవాలయాన్ని రాత్రికి రాత్రి ఈ విధంగా హిందూ దేవాలయం ఒకటి మాత్రమే తొలగించడం పై హిందువులు మండిపడుతున్నారు. ఇంతకు హిందూ దేవాలయాన్ని తొలగించింది దుండగులు హ లేక అధికారుల❓పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. _సంఘటన స్థలానికి చేరుకున్న ఆదిభట్ల పోలీసులు,విచారణ ప్రారంభించారు. హిందూ దేవాలయం మరలా నిర్మించేతవరకు నిరసన ఆపమని స్తానికులు అంటున్నారు.