సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం నగరంలోని నాగార్జున ఫంక్షన్ హాల్ వద్ద అక్రమ కట్టడాలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు కాలువ వెడల్పు తక్కువగా ఉండడం కారణంగా కాలువను కబ్జా చేసి కట్టిన కట్టడాలను తొలగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వర్షం పడిన రెండుసార్లు కవిరాజ్ నగర్ లోని ఇళ్లలోకి నీళ్లు రావడంతో మహిళలు అందోళనకు దిగారు. మహిళలు రోడ్డు ఎక్కడంతో స్పందించిన అధికార యంత్రాంగం స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారి చేసింది. ఇద్దరు కార్పొరేటర్ల సమక్షంలో కాలువను కార్పొరేషన్ సిబ్బంది వెడల్పు చేసారు. అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రదేశాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగరం మేయర్ పునుకొల్లు నీరజ సోమవారం పరిశీలించారు. వెంటనే స్పందించిన మంత్రులకు డివిజన్ మహిళలు ధన్యవాదాలు తెలిపారు. అక్రమ కట్టడాల తొలగింపులో ఐస్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ కావడంతో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు.