సిరా న్యూస్,మాదాపూర్;
గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (నిథిమ్) లో కూల్చివేతలు కొనసాగాయి. చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చవేతలు జరిగాయి. గచ్చిబౌలి సర్వేనెంబర్ 71లో 3 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువు వుండేది. ఈ చెరువు చుట్టూ నిథిమ్ క్యాంపస్ నిర్మాణం జరిగింది. నిథిమ్ యాజమాన్యం చెరువు బఫర్ జోన్ లో కొత్తగా భవన నిర్మాణం చేపట్టింది. చెరువును పూడ్చి భవన నిర్మాణం చేసారు. ఈ విషయంలో కోర్టును పలు స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయించాయి. కోర్టుకు చేరడంతో భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. భవనాన్ని తొలగించాలని హై కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మంగళవారం ఉదయం నుండి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.