Deputy CM Bhatti Vikramarka: మహిళా స్టాల్ సింగ్ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

సిరాన్యూస్‌, బ‌జార్‌హ‌త్నూర్‌

స్టాల్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

ఆదిలాబాద్ జిల్లా బోధ్‌ నియోజకవర్గం బ‌జార్‌హ‌త్నూర్‌ పిప్పిరి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్బంగా పిప్పిరి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించి మార్కెటింగ్, వస్తువుల ఉత్పత్తి గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. వెదురు వస్తువుల తయారీ, జూట్ బ్యాగ్ తయారీ, ఇత్తడి వస్తువుల తయారీ, గృహ అలంకరణ వస్తువుల తయారీ,  అగర్బత్తిల తయారీ, న్యాచురల్ తేనే ఉత్పత్తి, దాల్ మిల్ తయారీ, సేంద్రియ పసుపు, సేంద్రీయ చిరు ధాన్యాల ఉత్పత్తి ,స్వయం ఉపాధితో రాణిస్తున్న ఎంబ్రాయిడరీ నిర్వహిస్తున్న మహిళలతో ముచ్చటించి వారు నిర్వహిస్తున్న వ్యాపార నిర్వహణ గురించి తెలుసుకున్నారు. అదే విధంగా ఇంటింటా ఇన్నోవెంటల్ ప్రాజెక్ట్ ఎక్సిబిషన్ సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు తిలకించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన గర్ల్ సేఫ్టీ డివైసి, ఆటోమేటిక్ కార్ రిజర్వ్ పార్కింగ్,  ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డివైస్ హౌస్, రైన్ వాటర్ హార్వెస్టింగ్, గ్యాస్ అగ్ని ప్రమాదాల నివారణ, ఏసీ బస్ ఫైర్ అలర్ట్, సంప్రదాయ విద్యుత్తు తయారీ విధానం గురించి విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను చూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *