పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
డబుల్ బెడ్ రూం లకు రూ.5 కోట్లతో మౌళిక సదుపాయాలు
సిరా న్యూస్,పెద్దపల్లి;
నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం లకు రూ.5 కోట్లతో మౌళిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రం సమీపంలో గల పెద్దపల్లి మండలం హనుమంతునిపేట (రాంపల్లి) రైల్వే గేటు, చందపల్లి వద్ద గల డబుల్ బెడ్ రూం లకు డి.ఎం.ఎఫ్.టీ ప్యాకేజీ 2 ద్వారా రూ. 3.45 కోట్ల రూపాయలతో మౌళిక సదుపాయాలయిన రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణం మరియు నీటి సరఫరా అలాగే విద్యుత్ సరఫరా కు ఆనందంగా దాదాపు మొత్తం కలిసి రూ. 5 కోట్ల నిధులతో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ , మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు నూతన పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అరుణ శ్రీ, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, పెద్దపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డబుల్ బెడ్ రూం లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలోఅర్హులైన రైతులందరికీ రుణమాఫి
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతే రాజు అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి మండలం రాగినేడులో
అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటీ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 8 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి నిధులు కేటాయించిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేశామని చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని వాటిని రాష్ట్ర ప్రభుత్వం సరి చేస్తోందన్నారు. రైతులు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మొద్దని, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం సొసైటీ పాలకవర్గం, గ్రామస్థులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో విండో ఛైర్మన్ చింతపండు సంపత్, సిఈఓ తిరుపతి, డైరెక్టర్లు సోమ చంద్రయ్య, చింతపండు మల్లయ్య, యెల్లంకి స్వామి, తాడిషెట్టి సదయ్య, గండు వెంకన్న, కొత్త వెంకటమ్మ, లోకిని శారద, ఎడెల్లి శంకరయ్య, గుమ్మడి విజయ్, తదితరులు పాల్గొన్నారు.