సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఉచిత కోచింగ్ నిరుద్యోగులకు నోట్ బుక్స్ అందజేసిన దేవినేని ధర్మతేజ
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ని మార్కెట్ యార్డు లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిరుద్యోగులకు పెన్, నోట్ బుక్స్, ఫ్యాడ్స్ అమిలినేని సురేంద్ర బాబు మేనల్లుడు దేవినేని ధర్మతేజ పంపిణీ చేశారు. దాదాపు 700 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ తేజ మాట్లాడుతూ ఉచిత కోచింగ్‌ను నిరుద్యోగులు అందరు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సురేంద్ర బాబుకి నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.