సిరా న్యూస్,కోనసీమ;
కోనసీమ తిరుపతిగా పేరుందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్వామి దర్శనానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏడు శనివారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయి అని నమ్మకంతో ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి పొందిన వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చేరుకుని స్వామిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజామునించే భక్తులు ఏడు ప్రదక్షిణలు చేపట్టి స్వామి మోక్కు బడి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు.