సిరా న్యూస్,కమాన్ పూర్;
మంగళవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎన్ టి పి సి, ( పి టి ఎస్ ) హరి హర దేవాలయం ప్రాంగణం లోని అయ్యప్పస్వామి దేవాలయంలో ఆలయ పూజారి, గురుస్వామి బ్రహ్మశ్రీ వామనశర్మ చేతుల మీదుగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సభ్యుడు మరియు పెద్దపల్లి ఎమ్ ఎల్ ఏ కాంటేస్టేడ్ అభ్యర్ధి జనగామ అయ్యప్ప మాల ధరించారు. అనంతరం గురుస్వాముల ద్వార తెలుసుకున్న విషయాలను మరియు వివిధ పుస్తకాలలొ వివరించిన అయ్యప్ప స్వామి విశిష్టతలను నియమాలను జనగామ తిరుపతి అయ్యప్ప ధర్మ ప్రచారంలో భాగంగా వెల్లడించారు. అయ్యప్ప స్వామి మండల కాలదీక్ష తీసుకుని దైవత్వాన్ని ప్రపంచానికి చాటాలి అని పిలుపునిచ్చారు. పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో దేవత వుంటుంది అని మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం చెప్పుతుంది అని తెలిపారు. ఈ సోపానాలపై పద్దెనిమిదిమంది దేవతలను ఆవాహన చేశారు అని ఎనిమిది మంది దిక్పాలకులు, నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ వున్నాయి అని అన్నారు. నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఇరుముడితో వెళ్ళినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు అని అన్నారు.