Dharani issues: ధరణిలో తహసీల్దార్, ఆర్డీవోలకు ధరణి లాగిన్

సిరా న్యూస్,కరీంనగర్;
బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల లావాదేవీల కోసం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ధరణి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం…ధరణిపై ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ధరణి పోర్టల్ సాంకేత సమస్యలతో రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్న రైతులు, భూయజమానులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ధరణిలోని భూసమస్యలకు పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పలు జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం రంగంలోగి దిగింది. భూసమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు పాత దస్త్రాలను పరిశీలించాలని రెవెన్యూశాఖ అధికారులు నిర్ణయించుకున్నారు.ధరణి సమస్యలపై కలెక్టర్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి… జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి జూన్ చివరి నాటికి సమస్యల పరిష్కారాన్ని ఓ కొలిక్కి తీసుకోవాలని ఆదేశించారు. అయితే గతంలో ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్లకు మాత్రమే అధికారం ఉండేది. ధరణి దరఖాస్తులు పెద్ద సంఖ్యలో ఉండడంతో జాప్యం జరగకుండా ఉండేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌ లాగిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీఎల్‌ఎం, టీఎం-33, మిస్సింగ్‌ సర్వే నంబర్లు, భూమి హెచ్చుతగ్గులు, నిషేధిత జాబితాలోని భూములు, వారసత్వ భూములు, నాలా కన్వర్షన్, ఎన్నారైల భూములు, కోర్టు కేసుల్లోని భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ ఆఫీసుల్లో ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేసి ఏ తరహా భూ సమస్యలు ఎక్కువగా పెండింగ్‌ లో ఉన్నాయని స్పష్టం చేస్తూ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టరేట్‌తోపాటు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో డ్యాష్‌ బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. దరఖాస్తుల పెండింగ్‌కు కారణాలను డ్యాష్ బోర్డుల్లో ప్రజలకు తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ నెలాఖరు నాటికి పెండింగ్‌ దరఖాస్తులకు ఓ పరిష్కార మార్గం చూపాలని రెవెన్యూ యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత దరఖాస్తుల పరిష్కారం అయితే మరోసారి దరఖాస్తుల ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో లక్షలాది కుటుంబాలు భూసమస్యలు ఎదుర్కొంటున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. ఆ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను పునర్వ్యవస్థీకరించి, భూవ్యవహారాలను అందుకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ధరణి పోర్టల్ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపట్టింది. ధరణి పోర్టల్‌ అమలులో వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ భూసంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించి 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలని పరిశీలించింది. భూ వివాదాల పరిష్కార కోసం రెవెన్యూ ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలన్నింటిని కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ధరణి పోర్టల్‌ బలోపేతం చేయాడానికి, సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది.

21 thoughts on “Dharani issues: ధరణిలో తహసీల్దార్, ఆర్డీవోలకు ధరణి లాగిన్

  1. ధరణిలో అసైన్డ్ భూములకు హద్దులు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కును కల్పించాలి అసైన్డ్ భూములను అమ్ముకునే హక్కు లేకున్నా వాటికి హద్దులు పెట్టుకునే హక్కు రైతులకు కల్పించాలి ఎందుకంటే హద్దులు లేకపోవడం వల్ల కోర్టులో అసైన్డ్ భూములు ఉన్నవాళ్లు కేసులు గెలవలేక పోతున్నారు వాళ్ళని రౌడీషీటర్లు రాజకీయ నాయకులు వాళ్ల భూములను కబ్జా చేస్తున్నారు హద్దులు లేని కారణంగా చాలా కేసులు ఓడిపోతున్నాయి ఒక కోర్టు కేసులో హద్దులు ఉంటేనే గెలుస్తారు లేదంటే కోర్టు కేసు కొట్టివేస్తుంది అప్పుడు రౌడీషీటర్లు రాజకీయ నాయకులూ కలిసి పేద వాళ్లకు అన్యాయం జరుగుతుంది

  2. Sir gata 5 years nundi Andhra , Telangana pattadar pass book undi survey no 146/1ee
    R kotha gudem (G)village, Cherla mandal Bhadra dri, Kothagudem( dist), Telangana.
    Bavamardule, rowdeelala vyavaharistu, 3guri taravati unna chelleli aastini(2.65) acres land, aamukuvatam, 30 years taravata enta ichhi a teesuk nam, ippudu gata govt punyama aani swardam perigi, ma pi dowrganyam, rowdisam, rajakeeyam, palukubadi, tho mossam daga chestu, manland position Loki vellaniyakunda, narakam chupistunnaru.

    1. అన్న మాది సదాశివపేట మ నాన చనిపోయే 2 years అవుతుంది మా అసైండ్ భూమి 1ఏకర మా అమ్మ పేరు కలేదు మా నాన్న డెత్ సర్టిఫికెట్ భూమికీ సంబంధించినవి అన్నీ Mro ఆఫిస్ లొ ఈచము కానీ ఏపుడు అడిగిన కలెక్టర్ ఆఫిస్ కివెల్లెంది Tim పడతది అనీ అంటున్నారు sir తొందరగా ధరణి పని పూర్తి చేయండి sir ప్లీస్ 🙏🙏🙏🙏🙏 సర్వే నంబర్ 27/1ఆ యావపూర్ మండల్ సదాశివపేట

      1. ప్రభుత్వం మారింది కనుకా, మరోసారి కలెక్టర్ పేషీలో దరఖాస్తు ఇచ్చి చూడండి ..

      2. మరోసారి కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి చూడండి…

  3. Anni aadharala to unna bhumi ni Sadin chatam
    Lo Inka enta srama padalo ee janma sarpotundo ledo , nyayam, dharmam, manchi manvatvam, emipotunnayo aardham kakapoga, mundu mundu, entakina teginchadani ke, urike vacche vati tayaravutarane la undi eevyavasta,
    Nyayam ekkadundi evaru , chestarow, teliyatam ledu,🙏🙏👏👏

  4. గవర్నమెంట్ ఎం చేయాలనుకున్నా త్వరగా చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే రైతులు చాలా భూ సమస్యలను ఎదుర్కొంటున్నారు

  5. Assign cheste 5acres chestarugani
    30to40 acres chestaru anukoledu.
    Clear ga pattabhumi Ina forest vallu ma
    Bhumi Antaru survey cheyyimani court
    Orders unna 2019nuchi thippu thane
    Unnaru. Ippudina chestaremu causally.

  6. గత ప్రభుత్వం 2018 ఆన్లైన్ ధరణీ తెచ్చి ఎన్నో పొరపాట్లు చేసింది మా యొక్క address అమంగల్ మండల్ రంగా రెడ్డి district revenue officer Amangal సర్వే నంబర్ 274. 0.18gunta
    275. 0.24guntas
    280. 0.20guntas.
    205. 0.30gunta land online kaledhu Dharani T33 lo application petanu old ror new ror పరిశీలించి మా సమస్యకు పరిష్కరించండి.

  7. 2022 TM33 దరఖాస్తు చేసిన కలెక్టర్ అప్రూవల్ కూడ అయింది మళ్ళీ సీసీల్ కి దరఖాస్తు సెండ్ చేసారు సీసీల్ కూడ అప్రూవల్ అయింది ఐయినాకూడా సర్వే నెంబర్ ధరణి లో కూడ రావడం లేదు రెవిన్యూ ప్రిన్సఫుల్ సెక్రటరీ కూడ కలిసాను అయినా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు

  8. It is necessary to provide demarcation option for by number of survey number lands.

  9. లోకల్ ఎమ్మార్వో కొందరు నాయకుల చేతుల్లో ఉండటం మూలాన చాలా వరకు నష్టం జరుగుతుంది

  10. Sir. Assinend land patta cheyali compalsary cheyali eppdu chete next congress govt vastundi

    1. గత ప్రభుత్వం ఆలోచనలు చేసింది కానీ, అమలు చేయలేదు… ఈ ప్రభుత్వం అయిన అమలు చేస్తుందని చాల మంది ఆశిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *