సిరాన్యూస్, సైదాపూర్:
ప్రమాదస్థితిలో ఘనపూర్ కాల్వ: ధర్మ సమాజ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పారపు రమేష్
ఘనపూర్ గ్రామం నుండి సైదాపూర్ మండలం కు వెళ్లే మార్గం మధ్యలో ఉన్న కాల్వ కుప్పకూలే ప్రమాదస్థితిలో ఉందని ధర్మ సమాజ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పారపు రమేష్ తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘనపూర్ కాల్వతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కాల్వను పునర్మించాలని కోరారు. ప్రమాదాలు జరగకుండా రెడ్ సింబల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.