సిరాన్యూస్,చిగురుమామిడి
ధర్మసమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా తాళ్ల నరేష్
* జిల్లాలో పార్టీ బలపేతం కోసం పనిచేస్తా
ధర్మసమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తాళ్ల నరేష్ ను
నియమించినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజినల్ ఇంచార్జ్ చిలువేరు శ్రీకాంత్ తెలిపారు. గురువారం జిల్లా కార్యాలయంలో జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తాళ్ల నరేష్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షిరామ్ పోరాటాన్ని కొనసాగించే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాధికారమే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. పైన నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు విశారదాన్ మహారాజ్,రీజినల్ ఇంచార్జ్ చిలువేరు శ్రీకాంత్, జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలపేతం కోసం పనిచేస్తానని తెలిపారు.