మాజీ భర్త ఇంటి ముందు ధర్నా

సిరా న్యూస్,హైదరాబాద్;
తన కూతురి కోసం మాజీ భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఓ తల్లి. ఓయూ పీఎస్ పరిది హబ్సిగూడ రవీంద్ర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.పావని, నవీన్ రెడ్డి లకు గత 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన సంవత్సరం తర్వాత భార్య భర్తలు విడిపోయారు. పావని తన తల్లి దగ్గర ఉంటోంది. భార్య భర్త లకు కోర్టులో కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో కూతురు ఒకరోజు తన వద్ద ఉంచుకుంటాను అని చెప్పి తన వద్దే ఉంచుకున్నాడు తండ్రి. వారం గడుస్తున్నా తన కూతురిని తనకు ఇవ్వక పోవడం తో భార్య, భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ ఇన్ని రోజులుగా తనే వద్ద ఉన్న 5 సంవత్సరాల చిన్నారి నీ ఒక్క రోజు తన వద్దే ఉంటుందని చెప్పిన భర్త పాపను అప్పింగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాప పేరు మీద 4 ఎకరాల భూమి కోసం భర్త ఇలా చేస్తున్నాడని భార్య ఆరోపించింది. కోర్టు తీర్పు ప్రకారం బిడ్డ తన వద్దే ఉండాలని, కానీ నా కూతుర్ని నాకు దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తన కూతురిని అప్పగించాలని వేడుకుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *