సిరా న్యూస్,కామారెడ్డి;
జీతాలు రావడం లేదంటూ కామారెడ్డి మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఏమ్మేల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నామని, తమ సమస్యలు పరిష్కారించాలంటూ బైటాయించారు. అయితే ఏమ్మేల్యే వెంకట రమణరెడ్డి అందుబాటులో లేకపోవడంతో వీడియో కాల్ చేసి కార్మికులతో మాట్లాడారు. రెండు రోజుల్లో అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇవ్వడంతో మున్సిపల్ కార్మికులు దర్నా విరమించారు..