సిరాన్యూస్, ఖానాపూర్
మొక్కలు నాటుదాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం: విజేత పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్
మొక్కలు నాటుదాం…పర్యవరణాన్ని కాపాడుకుందామని విజేత పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోనీ విజేత పాఠశాల విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా విజేత పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణలో ఎంతగానో దోహదపడే మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చెట్లు లేకపోతే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి , వృక్ష సంపదను కాపాడుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ సమస్త మానవాళికి ప్రాణవాయువు అందించగలిగేవి మొక్కలు మాత్రమేనని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.