ఉదయం 9 గంటలకు 85 శాతం పూర్తయిన పింఛన్ల పంపిణీ

సిరా న్యూస్,విజయనగరం;
జిల్లాలో మంగళవారం తెల్లవారు జాము నుంచి అన్ని గ్రామాలు, మునిసిపల్ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా ఫించన్ మొత్తాల పంపిణీ ముమ్మరంగా జరిగాయి. గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో పర్యటించి ఫించన్ మొత్తాల పంపిణీని జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్.అంబేద్కర్ పర్యవేక్షించారు. ఉదయం 9 గంటలకు జిల్లాలో 85 శాతం ఫించన్ మొత్తాల పంపిణీ పూర్తి అయినట్లు అయన వెల్లడించారు. ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో మొత్తం 2,78,240 ఫించన్ దారులకు గాను 2,34,785 మందికి ఫించన్ మొత్తాల పంపిణీ పూర్తి అయినట్లు అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *