శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే పై అసమ్మతి వర్గం నినాదాలు

సిట్టింగ్ ఎమ్మెల్యే కిరణ్ కు టికెట్ ఇవ్వొద్దని నిరసన
ఎచ్చెర్ల నియోజకవర్గంలో కిరణ్ వద్దు.. జగన్ ముద్దు..అంటూ మిన్నట్టుతున్న నినాదం
సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే టికెట్ గొర్లె కిరణ్ కు తప్ప ఎవరికిచ్చిన మా మద్దతు ఉంటుందని నియోజక వర్గం వైసిపి నాయకులు స్పష్టం చేశారు.
లావేరు మండలంలోని సుభద్రపురం గ్రామంలో ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే అసమ్మతి వర్గ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ వలన అనేక విధాలుగా అసంతృప్తికి గురయ్యమని, సీనియర్లును ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకునేదాకలే లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కిరణ్ కార్యకర్తలను గౌరవించలేదని, రాజకీయాన్ని తన స్వార్ధానికి వాడుకున్నారని మండిపడ్డారు. కిరణ్ కు తప్ప ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తమ పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేశారు. అధిష్టానానికి ఈ విషయం గతంలోనే తెలియజేసామని.. అయిన ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి కార్యకర్తలను నాయకులను కాపాడుకోవాలని కోరారు. అనంతరం జగన్ ముద్దు .. కిరణ్ వద్దు అని నినాదాలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *