సిరా న్యూస్,బద్వేలు;
రాయచోటి లోని వికలాంగ విద్యార్థులకు శనివారం మానవతా ఆధ్వర్యంలో అన్నదానం తో పాటు విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పండ్లు వితరణ చేశారు.రాయచోటి వృక్ష రక్షణ సమితి వ్యవస్థాపకులు తులసి రెడ్డి కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భవిత (వికలాంగులు) స్కూల్ నందు మానవతా లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారి ఆధ్వర్యంలో వికలాంగుల విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు, పండ్లు, కిడ్స్ తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మానవతా శాఖ అధ్యక్షులు గూడూరు ఖధర్ భాష, సెక్రటరీ అంకం జయచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు గంగాధర్ నాయుడు, చైర్మన్ అరమాటి శివగంగారెడ్డి, గౌరవ అధ్యక్షులు వెంకటరమణ, కో చైర్మన్ షకీల్ , లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వ్యవస్థాపకులు,జిల్లా జి ఎల్ ల్టి కో ఆర్డినేటర్ లయన్ హరినాద్ రెడ్డి,ఫాస్ట్ రిజన్ చైర్మన్ నారాయణ రెడ్డి తో పాటు సమిళిత ఉపాధ్యాయులు త్రిలోక్,జనార్దన్,సిబ్బంది తో కలిసి విద్యార్థులకు ప్లేట్లు,గ్లాసులు,కిడ్స్ లను అందజేశారు.అనంతరం విద్యార్థులకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృక్ష రక్షణ సమితి వ్యవస్థాపకులు తులసిరెడ్డి కుమారుడు క్రాంతికుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని వికలాంగుల విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమం అన్నారు. వారి కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు వారి వ్యాపారం దిన దినాభివృద్ధి చెంది ,అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నామన్నారు. తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మానవతా లైన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయడం నా పూర్వజన్మ సుకృతం అని పెద్దలు తులసి రెడ్డి తెలియజేశారు. జన్మదినం సందర్భంగా తమ విద్యార్థులను గుర్తించి వారికి ఒక పూట అన్నదాన కార్యక్రమం తో పాటు ప్లేట్లు క్లాసులు పండ్లు అందజేయడం భవిత స్కూల్ వృక్ష రక్షణ సమితి వ్యవస్థాపకుల తులసిరెడ్డి మానవతా సంస్థ లైన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ రోడ్ క్లబ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మానవతా కోశాధికారి మురళీమోహన్ ,సభ్యులు సయ్యద్ అష్రఫ్ అలీ, షేక్ అల్లా బకాష్, విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
=====