సిరా న్యూస్,మేడ్చల్ ;
మాతృదేవోభవ సత్సంగ శ్రీ రామలింగేశ్వర కాలనీ కీసర మండలం బ్రాంచ్ కార్యాలయంలో పేద మహిళలకు కుట్టు మిషను పంపిణీ చేచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాతృదేవోభవ సత్సంగ వ్యవస్థాపక అధ్యక్షులు కేబి. శ్రీధర్.. విచ్చేసిన కుట్టు మిషను పంపిణీ చేచారు తమ సంస్థ అనేక సేవాకార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా పేద మహిళలకు జీవనోపాధికి కుట్టూ మిషన్లు కీసర బ్రాంచ్ కార్యాలయంలో శివలెంక నాగాఉదయ లక్ష్మి చీఫ్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిందని అన్నారు. మున్ముందు అనేక సేవాకార్యక్రమాలు చేస్తామని అన్నారు. తన మాతృమూర్తి పేరున ప్రతినెలా వృద్ధ ఆశ్రమాలకు సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. శివలేంక నాగ ఉదయలక్ష్మి .మాతృదేవోభవ సంస్థ ను మరింత అభివృద్ధి చేస్తామని నేటి సమాజానికి మాతృ మూర్తి విశిష్ట యువతకు ప్రచారం ద్వారా తెలియ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రా ల సెక్రటరీ విజయ కనక దుర్గ జాతీయ కార్య దర్శి భాస్కర్ శారద జాతీయ కార్యదర్శి అల్లాజీ విజయ్ పాల్గొన్నారు.
======================xxx