సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలుసేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ హాజరై కొమరబండ గ్రామంలో అంగన్వాడి స్కూల్లో పిల్లలకు స్టడీ టేబుల్స్, పేదలకు చీరలు, దోవతలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విసిట్ లో భాగంగా నవరత్నాల సేవా కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారిని వాసవి క్లబ్ అధ్యక్షులు వంగవీటి నాగరాజు, సెక్రెటరీ చిత్తలూరి భాస్కరరావు, కోశాధికారి వెంపటి ప్రసాద్, వాసవి క్లబ్ ఐఈసి వంగవీటి వెంకట గురుమూర్తి, రీజియన్ చైర్మన్ చల్లా లక్ష్మీ నరసయ్య, జెడ్ సి ఇమ్మడి సతీష్ లు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు. అదే విధంగా కోదాడ బైపాస్ వై జంక్షన్ వద్ద వెల్కమ్ బోర్డు, 25 కే సి జి ఎఫ్ లు, 10 కొత్త మెంబర్షిప్ లు, చేయించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు వంగవీటి నాగరాజు మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా పెద్ద పెద్ద సేవ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐపిసి గరిణి శ్రీనివాసరావు, డి ఐ లు జగిని ప్రసాద్, వంగవీటి లోకేశ్వరరావు, వాసవి క్లబ్ విజయం అధ్యక్షులు గుండా ప్రవీణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.