సిరాన్యూస్, ఆదిలాబాద్
రాజీమార్గమే రాజమార్గం : జిల్లా జడ్జి కె ప్రభాకర్ రావు
* ఆదిలాబాద్ కోర్టు కాంప్లెక్స్‌లో జాతీయ లోక్ అదాలత్
కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గమని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ కోర్టు కాంప్లెక్స్ హాల్ లోజాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించు కునేందుకు లోక్ అదాలత్ మంచి కార్యక్రమన్నారు. అదేవిధంగా సైబర్ ద్వారా మోసపోయిన బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చి మోసపోయిన డబ్బును తిరిగి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.