సిరా న్యూస్, ఆదిలాబాద్:
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి…
– డిఎల్ఎస్ఏ సెక్రెటరీ క్షమా దేశ్ పాండే
బాలికలు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్ పాండే అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా అడ గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన బాలికల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బాలికలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణ, బాలికల సంరక్షణ చట్టాలు, తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఉన్నత చదువులు చదివి, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుణవంత్ రావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.