సిరా న్యూస్, చిగురుమామిడి:
ఇస్రో చైర్మన్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న చాడ సంపత్ రెడ్డి…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రెకొండ గ్రామానికి చెందిన చాడ కమల-భూపతి రెడ్డి దంపతుల చిన్న కుమారుడైనా చాడ సంపత్ రెడ్డి డాక్టరేట్ పట్టా పొందాడు. ఈ నెల 5న జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన “గ్రాడ్యుయేషన్ డే” కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ శ్రీధరన్ పనిక్కర్ సోమనాథ్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. “సెక్యూర్ ఎనర్జీ ఎఫిషియంట్ రూటింగ్ టెక్నిక్స్ ఫర్ లార్జ్ స్కేల్ వైర్ లెస్ సెన్సార్ నెట్వర్క్ ” అనే అంశంపై నిర్వహించిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ పట్టాను పొందినట్లు చాడ సంపత్ రెడ్డి తెలిపారు. ఈయన ప్రస్తుతం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్, కరీంనగర్ సియస్ఈ విభాగంలో అసోనియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన పిహెచ్‌డి కి సహకరించిన గైడ్ ప్రొఫెపర్ జి నర్సింహా, శ్రీచైతన్య కళాశాల చైర్మన్ ఎం. రమేశ్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ K. నరేందర్ రెడి, ప్రిన్సిపాల్ డా.ఏ. ప్రసాద్ రాజు, సియస్ఈ హెచ్వోడి డా. కిషోర్, టోటి ఆధ్వాస్తకులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.