dog attack:  కుక్కదాడితో యువకుడి మృతి

సిరా న్యూస్, కోనరావుపేట
 కుక్కదాడితో యువకుడి మృతి

కుక్క దాడితో ఓ యువకుడు మృతి చెందిన సంఘ‌ట‌న‌ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ధర్మారంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మారం గ్రామానికి చెందిన మంకు వినోద, శంకర్ దంపతులకు ఇద్దరు కొడుకులు అరవింద్, అరుణ్(28), కూతురు అశ్విని ఉండగా, వీరు ఇదే మండలంలోని నిజామాబాద్ గ్రామంలో నివసిస్తున్నారు. అరుణ్ మాత్రం ధర్మారంలోని తన నానమ్మ, తాతయ్య ఇంటి వద్ద ఉంటున్నాడు. నెల రోజుల క్రితం నిజామాబాద్ గ్రామానికి వెళ్లగా అక్కడ పలువురు వ్యక్తులతోపాటు అరుణ్ పైన కూడా పిచ్చి కుక్కలు దాడి చేశాయి. దీంతో గాయపడ్డ అతను స్థానికంగా ప్రాథమిక చికిత్స తీసుకున్నాడు. 15 రోజుల తర్వాత ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోదకు తరలించారు. అక్కడి నుంచి నాలుగు రోజుల కిందట గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. కాగా అతడికి వైద్యం కోసం సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించినప్పటికీ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యా లయంలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ చిన్న వయసులోనే మృతిచెందడంతో మండల వాసులు ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు.

One thought on “dog attack:  కుక్కదాడితో యువకుడి మృతి

  1. Thank you for sharing this insightful and well-written blog post. The information you presented was supported by credible sources, and I appreciated the balanced approach you took in presenting different perspectives. To learn more about this subject, click here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *