సిరా న్యూస్, హుజురాబాద్:
గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలి: ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి దొమ్మటి వేణుగోపాల్
గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి దొమ్మటి వేణుగోపాల్ అన్నారు. శనివారం ఏఐఎస్ఎఫ్ హుజురాబాద్ మండల కౌన్సిల్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ ముసుగులో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఫీజులు మోత మోగిస్తున్నాయని ,గుర్తింపు లేని పాఠశాలలను వెంటనే గుర్తించి ఆయా పాఠశాలను సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పర్మిషన్స్ లేకుండానే అడ్మిషన్ ఇస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నాయని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు మోత మోగిస్తున్న మండల విద్యాశాఖ అధికారి చోద్యం చూస్తున్నారే తప్ప గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రాపెల్లి రోహిత్, అనూప్, వంశీ తదితరులు పాల్గొన్నారు.