సిరా న్యూస్,మచిలీపట్నం;
కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. జనసైనికులు కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఆయన స్థానిక R&B అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం పార్లమెంట్ ను అన్ని విధాలా అభివృద్ధిపర్చడమే తన లక్ష్యమన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందరు పోర్టు నిర్మాణాన్ని యేడాదిన్నరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషవ్ వారితో మాట్లాడి మచిలీపట్నంకు ఆయిల్ రిఫైనరీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
=======