సిరాన్యూస్, సైదాపూర్:
కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం : మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్
* సైదాపూర్‌లో రుణమాఫీ సంబరాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 2లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా గురువారం సైదాపూర్ రైతు వేదికలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాంలో ఆయనతో పాటు మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి బాణ సంచాలు కాల్చి సంబరాలను నిర్వహించారు. మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పంట రుణమాఫీ చేయడం రైతులకు చాలా సంతోషకరమైన విషయం అన్నారు. సీఎం రేవంత్ ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీని నేరవేర్చడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.