సిరాన్యూస్, ఓదెల
ప్రకృతి సేవా పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ భీష్మ చారి నేత
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ మేరుగు భీష్మాచారి నేత పర్యావరణ సేవా పురస్కారం మహబూబాబాద్ లో రాష్ట్ర పర్యావరణ ప్రేమికుల సదస్సు లో అందుకున్నారు. మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, హరితమిత్ర అవార్డు గ్రహీత మొక్కల వెంకన్న రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరిత ప్రేమికులను ఆహ్వానించారు. ఈ సందర్బంగా సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ మేరుగు భీష్మాచారి నేతకు “ప్రకృతి సేవా పురస్కారం అవార్డును అందజేశారు. ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి, రమేష్, లయన్ రామకృష్ణా రెడ్డి,లయన్ శంకర్,వాసు, చంద్రమౌళి ,పృథ్విరాజ్, రాజమౌళి, ప్రకాష్ రెడ్డి, నరహరి,కోండ్రు,వేణు,సతీష్,క్యాతం వెంకటేశ్వర్లు,సారంగం,అల్లం సతీష్ ఇ.వెంకటేశ్వర్లు , బైరీవినోద్, నవీన్ సంతోష్, అభినందనలు తెలిపారు.