సిరాన్యూస్, ఓదెల
ఐలు లక్ష్మి చూపు సజీవం: సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి
* నేత్రదానంతో ఇద్దరికి చూపు
* కుటుంబ సభ్యులను అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
* నేత్రాలను సేకరించిన ఎల్విపి టెక్నీషియన్ సతీష్
పెద్ద పల్లి జిల్లా ఓదెల నివాసి అయిన ఐలు లక్ష్మి బుధవారం మృతి చెందారు. ఈసందర్బంగా కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతరం కరీంనగర్ ఎల్విపి టెక్నీషియన్స్ గాజుల సతీష్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ పంపించారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారులు కోడండ్లు శ్రీనివాస్ , రాజేశ్వరి ,స్వామి గీత, కూతురు అల్లుడు జొoగోని శాంత, చంద్రయ్య ,రావుల శ్యామల, రవీందర్, జోoగోని లావణ్య రవీందర్, సహకరించిన గోపతి తిరుపతి (ఎల్ఐసి)లకు క్యాతం మల్లేశం క్యాతం. వెంకటేశ్వర్లు, కొండ్రా.వేణు, మేరుగు సారంగంలకు దాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి అభినందనలు తెలిపారు.అలాగే సమాజహితం కోరి నేత్రదానం చేసిన కుటుంబానికి సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ,ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్భీ ష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి,ప్రచార కార్యదర్శి వాసు .పృథ్విరాజ్,నరహరి,లగిశెట్టి చంద్రమౌళి, బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.