Dr. Bhishmachari:అప్పని చంద్రయ్య చూపు సజీవం: సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి 

సిరా న్యూస్, ఓదెల
అప్పని చంద్రయ్య చూపు సజీవం: సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి 
* నేత్రదానంతో ఇద్దరికి చూప
* అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
* నేత్రాలను సేకరించిన ఎల్విపి టెక్నీషియన్ గాజుల సతీష్

పెద్ద పల్లి జిల్లా, ఓదెల నివాసి అప్పని చంద్రయ్య సోమవారం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి నేత్రదానంపై అవగాహన కల్పించగా ఒప్పుకున్నారు. దీంతో కరీంనగర్ ఎల్విపి టెక్నీషియన్స్ గాజుల సతీష్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్విపి ఐ బ్యాంక్ పంపించారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భార్య రాయమల్లమ్మ, కుమారుడు కోడలు స్వామి -రాజమణి, కుమారుడు సందీప్ కు , సహకరించిన అప్పని తిరుపతి, చెరుకు తిరుపతి కు పాల్గొన్న క్యాతం మల్లేశం కొండ్ర వేణు,క్యాతం.వెంకటేశ్వర్లు మేరుగు సారంగం, సంతోష్ అల్లం సతీష్ శ్రద్దాంజలి ఘటించి అభినందనలు తెలిపారు.అలాగే సమాజహితం కోరి నేత్రదానం చేసిన కుటుంబానికి సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శివాసు, పృథ్విరాజ్, నరహరి, లగిశెట్టి చంద్రమౌళి, బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *