సిరాన్యూస్, ఓదెల
లగిశెట్టి మల్లమ్మ చూపు సజీవం :డాక్టర్ భీష్మాచారి
* నేత్రదానంతో ఇద్దరికి చూపు
* అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
* నేత్రాలను సేకరించిన ఎల్విపి టెక్నీషియన్ గాజుల సతీష్
పెద్ద పల్లి జిల్లా ఓదెల నివాసి అయిన లగిశెట్టి మల్లమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆ కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి నేత్రదానంపై అవగాహన కల్పించారు. కరీంనగర్ ఎల్విపి టెక్నీషియన్ గాజుల సతీష్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్విపి ఐ బ్యాంక్ పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారుడు కోడలు సమ్మయ్య-నిరజలకు , సహకరించిన లగిశెట్టి లక్ష్మణ్,కు పాల్గొన్న క్యాతం మల్లేశం ,క్యాతం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు,మేరుగు సారంగం,సంతోష్ బైరీ .వినోద్ శ్రద్దాంజలి ఘటించి అభినందనలు తెలిపారు. అలాగే సమాజహితం కోరి నేత్రదానం చేసిన కుటుంబానికి సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు , పృథ్విరాజ్,నరహరి,లగిశెట్టి చంద్రమౌళి, బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.