చిగురుమామిడి, సిరా న్యూస్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఇందూర్తి గ్రామంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్మిక సంఘం అధ్యక్షుడు అందె బాలయ్య మహారాజ్ జెండా ఎగురవేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మాట్లాడుతూ వెట్టి చాకిరీ విముక్తి రోజుకు ఎనిమిది గంటల పని పనికి తగిన వేతనం భారత రాజ్యాంగం లో రాయబట్టే ఆ మహానుబావుడు కల్పించిన దానివల్లే జరుగుతుందని చెప్పారు. అంబెేడ్కర్ రాజగృహమునందు అధ్యక్షుడు పరుశరాం మహారాజ్ జాతీయ జెండాను ఎగురవేశారు . జనవరి , 26 రాజ్యాంగం అమలు దినోత్సవమని ఇది మన అందరి పుట్టినరోజని బాబా సాహెబ్ అంబెేడ్కర్ సేవలను కొనియాడారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద జెండా ఎగురవేశారు . గ్రామపంచాయితీ కార్యాలయం లో సర్పంచ్ అందె స్వామి స్వరూప జెండా ఎగురవేశారు . కార్యక్రమం లో ఎంపీటీసీ స్వామి స్వప్న .కార్యదర్శి ఈవీ రెడ్డి , వార్డు సభ్యులు , విద్యార్థులు , గ్రామ ప్రజలు గాదె లక్ష్మి చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ గాదె రఘు నాథ్ రెడ్డి , వివిధ పార్టీల నాయకులూ అందరు పాల్గొన్నారు.