సిరాన్యూస్, హుజురాబాద్:
రక్తదానం మహాదానం: డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ చందు
* రక్తదానం చేసిన సైదాపూర్ మండల యువకులు
* ఘనంగా హుజురాబాద్ ఆస్పత్రిలో ప్రపంచ రక్తదాన దినోత్సవం
రక్తదానం మరో వ్యక్తికి ప్రాణదానం చేయడమేనని డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ చందు అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హుజరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన బొనగిరి అనిల్, వేముల సాయి కుమార్, దొంత సురేష్ లు రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసేవారికి హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ కరీంనగర్ డా.చందు, సైదాపూర్ మండల అరోగ్య కేంద్రం అధికారి సౌమ్య, ఏఎన్ఎం శారదలు సర్టిఫికెట్ ను అందజేశారు. అంతరం డిప్యూటీ డిఎంహెచ్వో డా.చందు మాట్లాడుతూ రక్తదానం ఇంకొకర్ని ప్రాణాపాయం నుంచి రక్షిస్తుందన్నారు. అందుకే ఎవరైనా సరే ఈ సమయంలోనైనా రక్తదానం చేస్తే ఇంకొకరి ప్రాణాలను రక్షించిన వాళ్ళం అవుతామని అన్నారు.