సిరా న్యూస్, ఇచ్చోడ
పశువులు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి: జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కిషన్
పశువులు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కిషన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పలు డైరీ ఫామ్‌లను మంగళవారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కిషన్, మండల పశువైద్యాధికారి గోవిందు నాయక్ తో కలిసి సందర్శించారు. పాడి రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పాడిపశువులకు ఎక్కువగా తాగునీరు , ఆకుపచ్చ పశుగ్రాసాన్ని అందించడం వల్ల పాల దిగుబడిని తగ్గకుండా కాపాడుకోవచ్చని అన్నారు. వచ్చే వర్షాకాలం ప్రారంభంలో పాడి పశులకు సరైన టీకాలు వేయించి వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది శేఖర్, రమేష్, పాడి డైరీ రైతులు అభిషేక్ శివ ఉన్నారు.