సిరాన్యూస్,ఓదెల
అవయవ దానంతో ఆయువు పోద్దాం : సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి
అవయవ దానంతో ఆయువు పోద్దామని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి అన్నారు.మంగళవారం పెద్దపల్లి జిల్లా అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ఓదెల లోని టీచర్లకు, విద్యార్థులకు అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించారు. ఈసందర్బంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి మాట్లాడారు. సమాజంలో ప్రమాదాలతో ప్రాణాంతక వ్యాధులతో అవయవాలు దెబ్బతిని ప్రతి 15 నిముషాల కొకరు అర్ధాంతర మరణాలకు గురి అవుతున్నారని అన్నారు.ఈ మరణాలను తగ్గించేందుకు మార్గం బ్రెయిన్ డెడ్ అయిన వారు అవయవదానం చేయడమేనని అన్నారు. ఓదెల మండలం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు 180 నేత్రలు 3 అవయవ, ఒక్కరు శరీర దానం చేసి ఆదర్శంగా నిలవడం స్పూర్తి దాయకమని ప్రశంసించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, మరణానంతరం ఉపయోగపడే అవయవ,శరీరాలను మట్టిలో వృధా పోనీయకుండా దానం చేసి ధన్య జీవులు కావాలని ,అలాగే ప్రతిమ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ క్యాతo.మల్లేశం నరహరి రాజ మల్లయ్య ,మాజీ హెచ్ఎంసి చైర్మన్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు . క్యాతo మల్లేశం టీచర్స్. హెచ్ఎం వెంగళ పద్, బండి శోభారాణి , కొమురెల్లి.అశోక్, సుమన్ ప్రాన్నీస్ రెడ్డి రాజేందర్ రెడ్డి. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.